పుష్ప 2 టీం కి విషెస్ చెప్పిన సాయి దుర్గ తేజ ..! 18 d ago
హీరో సాయి దుర్గ తేజ పుష్ప 2 మూవీ టీం కి శుభాకాంక్షలు తెలిపారు. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 గురించి మెగా కుటుంబం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. తాజాగా హీరో సాయి దుర్గ తేజ తన ట్విట్టర్ వేదికగా పుష్ప 2 చిత్ర బృందానికి తన హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కాగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు పుష్ప 2 ప్రీమియర్ లు రిలీజ్ కానున్నవి.